Home » Miscellaneous » Dasari Siva
Dasari Siva

 

ఈయన పేరు దాసరి శివ. వయసు 30 సంవత్సరాలు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామానికి చెందిన ఈయన కాళ్ళు, చేతులను నమ్ముకుని కష్టించి పనిచేసే వ్యక్తి. కొద్ది రోజుల క్రితం ఈయన నిచ్చెన సహాయంతో ఎలక్ట్రిక్ పోల్ ఎక్కి టీవీ కేబుల్ లాగుతూ వుండగా అకస్మాత్తుగా నిచ్చెన పక్కకి జరగడంతో చెయ్యి హెటెన్షన్ కరెంటు తీగకి తగిలింది. దాంతో క్షణాల్లో ఆయన కుడి చెయ్యి మొత్తం కాలిపోయింది. శరీరం కూడా 36 శాతం కాలిన గాయాలకు గురైంది. తీవ్రంగా గాయపడిన శివని విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పది రోజులపాటు చికిత్స తీసుకున్నందుకు లక్షన్నర ఖర్చయింది.

 

à°† తర్వాత అక్కడి డాక్టర్లు శివని హైదరాబాద్లోని నిమ్స్ తీసుకెళ్ళాలని చెప్పారు. నిమ్స్లో కాలిన గాయాలకు చికిత్స విభాగం లేనందున నిమ్స్ డాక్టర్లు శివని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్ళాల్సిందిగా సూచించారు. గాంధీ ఆస్పత్రికి వెళ్ళిన తర్వాత శివకి కాలిన గాయాలతోపాటు ఊపిరితిత్తులు కూడా పాడైపోయిన విషయం బయటపడింది. దాంతో గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్ అందుబాటులో లేకపోవడం వల్ల  డాక్టర్లు శివని వెంటిలేటర్ అందుబాటులో వుంటే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళాల్సిందిగా సూచించారు. దాంతో కుటుంబ సభ్యులు శివని మెడిసిటీ ఆస్పత్రిలో చేర్పించారు. మెడిసిటీలో చికిత్సకు రోజుకు యాభై వేల ఖర్చు అవుతోంది. ఇప్పటికే శివ కుటుంబం తమ తాహతుకు మించి డబ్బు ఖర్చుపెట్టేసింది.

 

రెక్కాడితే తప్ప డొక్కాడని ఆ కుటుంబానికి శివ వైద్యానికి డబ్బు ఎలా సమకూర్చాలో అర్థం కావడం లేదు. రెండు మూడు రోజుల్లో శివ రికవరీ అయ్యే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు. మొత్తమ్మీద శివ కోలుకోవాలంటే మరో మూడు లక్షలు అవసరమని తెలుస్తోంది. ఇలాంటి సందర్భాల్లోనే మానవతావాదులు శివలాంటి అభాగ్యులను ఆదుకోవాలి. మనసున్న మనుషులు తలా ఒక చెయ్యి వేస్తే ఒక ప్రాణం నిలబడుతుంది..